"ఫోటోలు తీయవద్దు. ఫోటోలు తీయవద్దు. ఫోటోలు తీయవద్దు అనీ చెప్పానా ?" గుడిలో పూజ చేస్తున్న పూజారి, నా వైపు చూస్తూ అరుస్తున్న అరుపులు అవి.
"సర్లెండి. తీయను". అనీ నా సెల్ ఫోన్ ని జోబులో పెట్టుకుంటూ సమాధాన మిచ్చాను.
అతడు ఏవో మంత్రాలు చదువుతూ ఉండగా! నేను, ఉండబట్ట లేక, పూజారి గారిని ఆడిగాను.
"స్వామి. ఈ దేవుడి పేరు ఏమిటి?" అనంత శయన ఆసనంలో పడుకొని ఉన్న విగ్రహాన్ని చూస్తూ!!!!!
"రంగనాథ స్వామి వారు."
ఆ.... మళ్ళీ అడిగాను.
"రంగనాథ స్వామి వారు." అనీ అతని నుండి సమాధానం వచ్చింది.
"అదేంటి. ఇది బుద్ధుని విగ్రహము కదా!!!
వేరే దేవుడి పేరు చెబుతున్నారు ఎందుకు? అనీ అడిగాను.
పూజారి గారి నుండి ఇంకో మాట రాలేదు.
నాగార్జునసాగర్ కుడి కాలువ నుండి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో " అనుపు" అనే ప్రాచీన బౌద్ధ విశ్వవిద్యాలయం మరియు ప్రాచీన క్రీడ ప్రాంగానము ( కీ. పూ 3 వ. శతాబ్దమునకు చెందిన) ఉన్నది. అనీ
తెలిసి చూడ్డానికి వెళ్లడం జరిగింది.
అనుపు ప్రాంతానికి దగ్గరలో ఉన్న, రంగనాథ స్వామి దేవాలయంలోకి అడుగు పెడుతూనే,
ఫొటోలు తీయవద్దు అనే బోర్డ్ కనిపించింది.
ఇంత దూరంలో, అడవిలో ఉన్నా, ఈ ప్రాచీన గుడిని ఎందుకు ఫొటోలు తీయవద్దు!!!??? అనుకుంటూ లోపలికి అడుగు పెట్టాను.
నల్ల రాతి తో చెక్క బడిన ఏక శిలా బుద్ధుడి విగ్రహము అది. బుద్ధిజంలో "మహా పరి నిర్యాణమును" తెలుపు సందర్భానికి చెందినది.
ఖుషి నగరంలో, కుండ అనే ఒక శిష్యుని ఇంట్లో, అతను వండిన ఆహార పదార్థాన్ని తిన్న గౌతమ బుద్ధుడు, ఆ ఆహారము వలన, తీవ్రమైన అనారోగ్యమునకు గురి అయి, ప్రాణాలు పోయే క్రమంలో! తనకోసం ఏర్పారు చేసిన సేయన మందిరమై కుడి వైపుగా పడుకొని, చివరిసారిగా మల్లులకు జ్ఞానబోధ చేస్తున్నటువంటి సందర్భంలోనిది ఆ విగ్రహ స్థితి.
గౌతమ బుద్ధుడు. తాను బ్రతికున్నన్ని రోజులు, దేవుడు అనే భావన, దేవుడు అస్తిత్వాన్ని ఎప్పుడు దరిచేరనేయలేదు. దాని గురించి మాట్లాడడం శుద్ధ దండగ అనీ కొట్టి పారేసేవాడు.
ప్రకృతిలో కనిపించే ప్రతిదాన్ని దేవుడుని చేసే మన మానవ జాతి, ఆ గౌతమ బుద్ధుని మాత్రం ఎందుకు వదులుతారు. అతన్ని దేవున్ని చేశారు.
Budda Never believe the god but he became the god.
- కేశవ్ సిద్ధార్థ